మదనపల్లి ఆగస్టు 6 : (gtvmedia)దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకై సిపిఐ పాదయాత్ర నిర్వహిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు సిపిఐ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ సమాజంలో పేదరికం పోవాలని ప్రజల్లో మార్పు రావాలన్నారు. కాంటాక్ట్స్ విధానం అమలు చేయాలని, రాష్ట్రంలో రాజకీయ దౌర్జన్యాలు నశించాలన్నారు. అవినీతి అక్రమాలపై ప్రశ్నించిన సీజేపీ నాయకుడిని బిజెపి ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ వాళ్లు ఏ నేరం చేసి జైలుకు వెళ్లిన బెయిలు అవలీలగా వస్తుందని.. మిగిలిన వారికి బెయిలు రావడం లేదని విమర్శించారు. దేశంలో మహిళలకు భద్రత లేదని, ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశారు కానీ ఆదివాసి హక్కులను కాల రాస్తున్నారని అన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ మారిపోతుందని, దళితులకు న్యాయం అందడం లేదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న ఎర్రజెండా అయ్యే ప్రతిపక్షంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామానాయుడు, కృష్ణప్ప సాంబశివ, మురళి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకే సిపిఐ పాదయాత్ర
