అన్నమయ్య జడ్పీ చైర్మన్గా సుగవాసి ప్రసాదబాబు

మదనపల్లె, నవంబర్ 20: అన్నమయ్య జిల్లా పరిషత్ చైర్మన్ నియమిస్తూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. రాజంపేట మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు అయిన ప్రసాద్ బాబు ప్రస్తుతం రాజంపేట టిడిపి అధ్యక్షుడిగా ఉన్నారు.
అలాగే జడ్పీ వైస్ చైర్మన్ గా పిటిఎం మండలం జడ్పిటిసి సభ్యురాలు తలారి సారంజను నియమించారు.
జడ్పీ వైస్ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ నెలకొని ఉండడంతో.. మొలకలచెరువు జడ్పిటిసి జబ్బల మీనాకు ఇస్తారని చివరి వరకు ప్రచారం జరిగింది.
అనూహ్యంగా ఈ పదవిని తలారి శరణ్య కైవసం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *