మదనపల్లె, నవంబర్ 19: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మదనపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు.
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను గురువారం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు వివరించిన సమస్యలను ఆయన సావధానంగా విని, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.
న్యాయపరమైన అంశాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రతి సమస్యను న్యాయబద్ధంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ భాషా.

GTV మీడియా | మదనపల్లె
