గెలుపోటములకు అతీతంగా కార్యకర్తలకు అండగా.. ఆత్మీయ పరామర్శకు శ్రీరామ్ చినబాబు శ్రీకారం!

మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా నిలిచేందుకు మున్సిపల్ చైర్మన్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీరామ్ (చినబాబు) ప్రత్యేకంగా ఆత్మీయ పరామర్శ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో పాటు, స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన అభ్యర్థులను, వారి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి పరామర్శించి మనోధైర్యాన్ని నింపాలని నిర్ణయించారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పిస్తామని భరోసా ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఏ పరిస్థితుల్లోనూ విస్మరించబోమని, కార్యకర్తలే పార్టీకి బలమని చాటిచెప్పనున్నారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి కార్యకర్తకు నాయకత్వం అండగా ఉంటుందని తెలియజేయనున్నారు.

“గెలుపులో అభినందన.. ఓటమిలో ఆత్మీయత.. ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం” అనే సందేశంతో చేపడుతున్న ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు, నాయకులు–కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయనుంది.

ఆత్మీయ పరామర్శ – కార్యకర్తలకు భరోసా!

రాజకీయాల్లో గెలుపు ఒక్కటే కాదు.. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలవడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని ఈ కార్యక్రమం ద్వారా శ్రీరామ్ చినబాబు చాటిచెప్పనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *