మదనపల్లి రూరల్ మండలం ఈశ్వరమ్మ కాలనీ జడ్పీటీసీ, ఎంపిటిసి అభ్యర్థులకు ఈశ్వరమ్మ పంచాయతీ పరిధిలో కూటమి నాయకులతో కలిసి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్, మదనపల్లి ఇంచార్జి మరియు స్థానిక సంస్థల ఎన్నికల రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ గంగారపు రాందాస్ చౌదరి గారు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి గారు మాట్లాడుతూ, జడ్పీటీసీ అభ్యర్థి కొప్పుల రమ్య గారికి గాజు గుర్తుపై, ఎంపీటీసీ అభ్యర్థి చంద్ర శేఖర్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి, వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, ప్రజల సంక్షేమం మరియు ప్రాంత అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
