మదనపల్లె రూరల్ మండలం కోటవారిపల్లిలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ కూటమి అభ్యర్థుల తరఫున గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ కోటవారిపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. జడ్పీటీసీ అభ్యర్థికి గ్యాస్ గుర్తుపై, ఎంపీటీసీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.

