న్యూయార్క్‌లో జరిగిన 2026 ECOSOC యూత్ ఫోరమ్‌లో పాల్గొన్న మిట్స్ పూర్వ విద్యార్థి
మదనపల్లె: మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ) పూర్వ విద్యార్థి అబ్దుల్ సమీర్ షేక్ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 2026 ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ECOSOC) యూత్ ఫోరమ్‌లో ఆయన పాల్గొనడం మిట్స్ విద్యాసంస్థకు గర్వకారణంగా నిలిచింది.
మిట్స్‌లో 2018–2022 బ్యాచ్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) విభాగంలో బీటెక్ అభ్యసించిన అబ్దుల్ సమీర్ షేక్, విద్యార్థిగా ఉన్న సమయంలోనే అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ d.school ఆధ్వర్యంలోని యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ (UIF) కార్యక్రమానికి 2020 ఫాల్ బ్యాచ్ ఫెలోగా ఎంపికయ్యారని మిట్స్ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు.
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ యువజన సదస్సులో వివిధ దేశాలకు చెందిన యువ నాయకులు, విధాన రూపకర్తలు, సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న ప్రతినిధులు పాల్గొన్నారు. యువత సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ప్రపంచ సవాళ్లు, సామాజిక బాధ్యత వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మిట్స్ వ్యవస్థాపకులు, ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అబ్దుల్ సమీర్ షేక్‌ను అభినందించారు. మిట్స్ పూర్వ విద్యార్థులు అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటుకోవడం గర్వకారణమని, వారి విజయాలు ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
మిట్స్ పూర్వ విద్యార్థుల సంబంధాల అధికారి డాక్టర్ జి. నాగస్వేత మాట్లాడుతూ, విద్యాసంస్థలో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకుంటూ సమాజ అభివృద్ధికి తమవంతు సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అబ్దుల్ సమీర్ షేక్ మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికపై పాల్గొనడం తన జీవితంలో మరపురాని అనుభవమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన యువ నాయకులు, విధాన రూపకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడంలో యువత పాత్రపై మరింత అవగాహన పెరిగిందని చెప్పారు.
ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశాన్ని పరిచయం చేసి, తనను ప్రోత్సహించిన స్నేహితుడు యదీష్ కుంబలతిల్ రమేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో కలిసి ఈ సదస్సులో పాల్గొనడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అలాగే, తన విద్యాభ్యాస సమయంలో నిరంతరం ప్రోత్సాహం అందించిన మిట్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కార్యాలయ అసోసియేట్ డైరెక్టర్ యు. విజయలక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన అబ్దుల్ సమీర్ షేక్‌ను మిట్స్ ప్రో ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, అలుమ్ని రిలేషన్స్ అధికారి డాక్టర్ జి. నాగస్వేత, ఇంటర్నేషనల్ సెల్ అసోసియేట్ డైరెక్టర్ యు. విజయలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
మిట్స్‌లో ప్రారంభమైన అబ్దుల్ సమీర్ షేక్ ప్రయాణం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వేదిక వరకు చేరడం యువతకు స్ఫూర్తిదాయకమని విశ్వవిద్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు.



