మదనపల్లె, అక్టోబర్ 26:
మదనపల్లె లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ, రామాయణ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ధర్మబద్ధమైన జీవితం గడపాలని పిలుపునిచ్చారు.
వేటగాడైన రత్నాకరుడు మహర్షిగా మారిన వృత్తాంతం మానవాళికి పరివర్తనకు నిదర్శనమని, కుటుంబ విలువలను సమాజం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఈ వేడుకలో ఎస్బి సిఐ యు. సదాశివయ్య, ఆర్ఐ లు, ఎం. రవికుమార్, కె. సురేష్ కుమార్ రెడ్డి, యు.రంగనాథ్ బాబు, డీపీవో సిబ్బంది, తదితర పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
