7వ రోజు VRA ల నిరసన

మదనపల్లె, సెప్టెంబర్ 22: మదనపల్లి మండలం తహశీల్దారు కార్యాలయం ఎదుట మదనపల్లి మండలంలో పనిచేస్తున్న వీఆర్ఏలు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 7వ రోజు సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె కొనసాగించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ సిరివెళ్ల గురు ప్రసాద్ డివిజన్ అధ్యక్షుడు ఆవుల రమణ, రెడ్డప్ప, శాంత కుమార్, నాన్సీ, ఉష, గౌసియా, భాగ్యమ్మ వీఆర్ఏలు పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్లు* :-
1.వీఆర్ఏలకు తెలంగాణ రాష్ట్రం మాదిరి పే స్కేలును అమలు చేయాలి.
2.అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వోలుగా, అటెండర్లుగా, వాచ్మెన్,రికార్డ్ అసిస్టెంట్లుగా, ప్రమోషన్లు కల్పించాలి.
3.నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలి.
వీఆర్ఏలకు మద్దతుగా డిప్యూటీ తాసిల్దార్ వెంకటస్వామి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రహ్మణ్యం పాల్గొని మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *