మదనపల్లి: మదనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 5వ వార్డులో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి, స్థానిక సంస్థల ఎన్నికల రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
మదనపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు, 5వ వార్డు కూటమి కౌన్సిలర్ అభ్యర్థి చామంచుల మల్లికకు మద్దతుగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ, అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేస్తున్నారు. ప్రచారంలో స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
