వెంటనే పరిశీలించి మరమ్మత్తులకు ఆదేశించిన ఎమ్మెల్యే
మదనపల్లె అక్టోబర్ 18: మదనపల్లి పట్టణం ఏవి నాయుడు కాలనీలో రెండు రోజులుగా కురిసిన వర్షానికి రోడ్లు అంతా బురదమయంగా మారింది. కనీసం ప్రజలు నడవడానికి వీలు లేక ఇబ్బందులు పడుతుండడంతో.. స్థానికులు ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే హుటాహుటిన ఏవి నాయుడు కాలనీకి వెళ్లి బురదమయంగా మారిన రోడ్డును మరమ్మత్తు చేయాలని ఆదేశించారు.

