రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ముఖ్య అతిథిగా పరిశీలకుడు నెట్టెం వెంకటేష్

మదనపల్లె, జూలై 31: (gtvmedia)మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 7, 8 వార్డుల్లో గురువారం నిర్వహించిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్థానిక కూటమి నాయకులతో కలిసి మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా వార్డుల్లో విస్తృతంగా పర్యటించి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పెన్షన్లు, ‘తల్లికి వందనం’ వంటి పథకాల వల్ల లబ్ధి పొందుతున్నామని పలువురు తమ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తోందన్నారు. మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
పర్యటన సందర్భంగా స్థానికుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లె పరిశీలకులు నెట్టెం వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టౌన్ అధ్యక్షుడు నాదెళ్ల చింటూ, నాదెళ్ల విద్యాసాగర్, క్లస్టర్ ఇన్చార్జ్ రాటకొండ సోము, వైఎస్ మణిరత్నం, యాలగిరి దొరస్వామి, రామకృష్ణ పచ్చిపాల, నవీన్ చౌదరి, కలశం ప్రకాశ్‌తో పాటు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
