మదనపల్లె, అక్టోబర్13: సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం వారు జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం “ఔరా–2కె26 2.0” (ఔరా-2K26 2.0 ) కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బెంగళూరులోని వి.ఎం.ఎస్ కన్సల్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మరియు డైరెక్టర్ డాక్టర్ ఎం. సుధాకర పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కార్పొరేట్ రంగంలో కృత్రిమ మేధస్సు ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత నియామక ప్రక్రియలు, రెజ్యూమ్ల పరిశీలన, అభ్యర్థుల సామర్థ్యాల మూల్యాంకనం, ప్రతిభావంతులైన ఉద్యోగుల ఎంపికలో ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. వ్యాపార ప్రక్రియలను వేగవంతం చేయడం, ఉత్పాదకతను పెంచడం, సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో వివిధ సంస్థలు ఏఐ సాధనాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు, ఆధునిక ఏఐ సాంకేతికతలపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యార్థులు జనరేటివ్ ఏఐ, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ మరియు ఏఐ ఆధారిత పరిశోధనలలో నూతన ఆవిష్కరణలు చేయాలని, వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో ఏఐ భవిష్యత్తులో ముఖ్య పాత్ర పోషితుంది అని తెలిపారు. ప్రస్తుతం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ, కార్పొరేట్ సంస్థల అంచనాలకు అనుగుణంగా సిద్ధమైతే మెరుగైన ఉద్యోగావకాశాలను పొందవచ్చని ఆయన అన్నారు.దేశవ్యాప్తంగా ఉన్న యువ సాంకేతిక విద్యార్థుల మధ్య సాంకేతిక ఆవిష్కరణలు, సహకార అభ్యాసం మరియు ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉధ్యేశం అని అన్నారు. కార్యక్రమంలో ఆధునిక సాంకేతిక సెషన్లు, పేపర్ ప్రెజెంటేషన్లు, ప్రాజెక్ట్ ఎక్స్పోలు మరియు జనరేటివ్ ఏఐ ఆధారిత పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, కోఆర్డినేటర్స్ డాక్టర్ పూంగోదై, డాక్టర్ చొక్కనాథన్, కో-కోఆర్డినేటర్ కె.మహమ్మద్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



