మదనపల్లె, అక్టోబర్ 12: అన్నమయ్య జిల్లా పోలీసు శాఖలో తారా అనే జాగిలం విధుల్లోకి చేరింది. సోమవారం జిల్లా ఎస్పీ ధీరాజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో తారకు స్వాగతం పలికారు. ఎస్పీ మాట్లాడుతూ
మంగళగిరిలో 11 నెలల పాటు కఠిన శిక్షణ పొందిన ఈ జాగిలానికి, పేలుడు పదార్థాలను ముందుగానే పసిగట్టడంలో, గాలి వాసనతో నేరస్తులను ట్రాక్ చేయడంలో అత్యంత నైపుణ్యం ఉందన్నారు.
‘తార’కు సరైన పౌష్టికాహారం అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఎస్పీ హ్యాండ్లర్లకు సూచిస్తూ, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లలో తార సేవలను ముమ్మరంగా వినియోగిస్తామన్నారు.

