పోలీసు పిజీఆర్ఎస్ కు 82 ఫిర్యాదులు

మదనపల్లె, అక్టోబర్ 12:
మదనపల్లె లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

మొత్తం వచ్చిన 82 పిర్యాదులలో భూ వివాదాలు 36, ఆర్థిక వివాదాలు 13, కుటుంబ వివాదాలు 11, న్యూసెన్స్ 6, పరిపాలన సంబంధిత 6, సైబర్ 2, ఇతర సమస్యలు 8 ఉన్నాయి.

భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను ఆదేశించారు.

బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

ఈ ఫిర్యాదులపై విచారణను వేగంగా పూర్తిచేసి, సంబంధిత నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎస్పీ గారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *