బి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ ఎంపికలు.. 18 మంది విద్యార్థుల ఎంపిక

మదనపల్లె, అక్టోబర్ 11: మదనపల్లెలోని బి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 35 ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ, చిత్తూరు ఆధ్వర్యంలో ఎన్‌సీసీ ఎంపికల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎంపికల్లో 32 మంది విద్యార్థులు పాల్గొనగా, వారిలో 18 మంది ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గుత్తా గిరిబాబు మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఎన్‌సీసీలో చేరి, అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

35 ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్. దీపక్ సింగ్ మాట్లాడుతూ, ఎన్‌సీసీ శిక్షణ యువతను క్రమశిక్షణ గల, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు శిక్షణ, శిబిరాల్లో చురుకుగా పాల్గొంటూ ఐక్యత, జాతీయ సమగ్రత స్ఫూర్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సుబేదార్ శివ, హవిల్దార్ మహమ్మద్ నౌఫల్, హవిల్దార్ సురేష్, కళాశాల ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ టి. బాలాజీ,డా. జి. చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ప్రిన్సిపాల్, ఎన్‌సీసీ అధికారులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *