మదనపల్లె: భారత్ మాత స్ఫూర్తి కేంద్రం ట్రస్ట్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్జీఎస్ మండి ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రైతులు, హమాలీలు, కార్మికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లకు గుండె, దంత, చర్మ, కిడ్నీ తదితర వైద్య పరీక్షలతో పాటు బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందించారు. పలువురు ప్రముఖులు పాల్గొని కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు.
మదనపల్లె టమోటా మార్కెట్లో ఉచిత మెగా వైద్య శిబిరం
