రెడ్డివారిపల్లిలో రైతులకు పాస్‌బుకుల పంపిణీ

మదనపల్లె,అక్టోబర్9:అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి గ్రామ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా రైతులకు పాస్‌బుకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు భూమికి సంబంధించిన రికార్డులు, పత్రాలు సక్రమంగా ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు రైతులకు సులభంగా అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అవసరమైన సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *