హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన సభను విజయవంతం చేయాలి

మదనపల్లె: అక్టోబర్ 2న మదనపల్లెలో జరగనున్న రూ.1 లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేపట్టాలని.

మదనపల్లె మాజీ శాసనసభ్యులు శ్రీ దొమ్మలపాటి రమేష్ నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జోన్–4 కోఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిట్టిబాబు తదితరులతో కలిసి శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్టోబర్ 2న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో నిర్వహించనున్న హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణపై నాయకులు చర్చించారు. సభకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చేలా సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

మదనపల్లె ప్రాంతంలో ఉద్యానవన రంగ అభివృద్ధికి హార్టికల్చర్ హబ్ కీలకంగా నిలిచే అవకాశం ఉన్నందున, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో దొమ్మలపాటి యశస్వి, దొమ్మలపాటి తేజ, టీడీపీ అన్నమయ్య జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, రాష్ట్ర బోయ కార్పొరేషన్ డైరెక్టర్ మండెం ప్రభాకర్, మార్పూరి వరుణ్, మదనపల్లె రూరల్ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు నాదెళ్ల అరుణ్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *