ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి ప్రజల స్పందన.. సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే షాజహాన్ భాషా వివరణ

మదనపల్లె, జూలై 29: (gtvmedia)రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మదనపల్లె మున్సిపాలిటీ 3, 4 వార్డుల్లో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా స్థానిక కూటమి నాయకులతో కలిసి బుధవారం విస్తృతంగా పర్యటించారు.

ఇంటింటికి తెలుగుదేశం

ఈ సందర్భంగా ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్లు, ‘తల్లికి వందనం’ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సహాయం వంటి కార్యక్రమాలు తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రజలు స్వయంగా వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పాలనకు ప్రజలు విశేష ఆదరణ చూపుతూ ఘనంగా స్వాగతిస్తున్నారని అన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,ఆలయ చైర్మన్ గంగారపు నవీన్,రెడ్డి శేఖర్, జాఫర్ నిస్, తలకాయల శీను, హరినాథ్ గౌడ్, రామకృష్ణ, జయరాం, బర్ని, రెడ్డప్ప, రెడ్డి భూ, కారంపూడి శంకర్, రమణ, హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *