సీఎం బహిరంగ సభ వద్ద పటిష్ట బందోబస్తు

అక్టోబర్ 2న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పలువురు వీఐపీలు మదనపల్లె బహిరంగ సభలో పాల్గొనే స్థలం వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి ఆదేశించారు.
సోమవారం చంద్రకాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన సభాస్థలిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పరిశీలించారు.

సభా ప్రాంగణం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎస్పీ సూచనలు జారీ చేశారు.

వీఐపీల పర్యటన వల్ల సాధారణ ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఎస్పీలు ఎం. బుచ్చిరాజు, డి.ఏడుకొండల రెడ్డి, ఎస్బి సీఐ యు.సదాశివయ్య, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *