సీఎం పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు

మదనపల్లె,సెప్టెంబర్ 26:గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మదనపల్లెకు విచ్చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

సీఎం పర్యటనలో భాగంగా నిర్వహించనున్న ప్రజావేదిక, కార్యకర్తల సమావేశం సభా స్థలాలను సీఎం కార్యక్రమాల కమిటీ కన్వీనర్ పెందుర్తి వెంకటేష్ తో కలిసి, జిల్లా అధికారులతో సమన్వయంగా ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా పరిశీలించారు.

సభా ప్రాంగణం, ప్రజావేదిక, వేదిక ఏర్పాట్లు, ప్రజలు మరియు కార్యకర్తలకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సీఎం పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *