కోడిగుడ్డు వ్యవహారంలో విద్యార్థి సంఘాల ఆరోపణలు అవాస్తవం

మదనపల్లె సెప్టెంబర్ 24 :
అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కోడిగుడ్ల వ్యవహారంలో అక్రమాలకు చోటు లేదని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. డీఈవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమావేశమై సంయుక్తంగా ప్రకటించారు. వారు మాట్లాడుతూ పాఠశాలల నుంచి వెళ్లిన ఇండెంట్లు, విద్యార్థుల సంఖ్య, వినియోగం వివరాలు, హెచ్ఎంల దృవీకరణ, ఆన్లైన్ అప్రూవల్స్ అన్ని వివరాలు రికార్డుల్లో వున్నాయన్నారు. ఈ వివరాలను నాలుగు రోజులుగా విచారణ కమిటీ సభ్యులు తనిఖీలు చేస్తున్నారన్నారు. కోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అక్రమాలకు జరగలేదని ఆన్లైన్ రికార్డులు పరిశీలిస్తే తెలుస్తాయన్నారు. కాని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, వ్యక్తిగత దుష్ప్రచారానికి దిగడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోల సంఘం అధ్యక్షుడు రెడ్డిశేఖర్, ప్రభాకర్రెడ్డి, నారాయణ, హెచ్ఎంల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, వైవీ రమణ, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్, గిరిధర్నాయక్, యూటీఎఫ్ నాయకులు పురం వెంకటరమణ, విజయ్కుమార్, ఏపీటీఎఫ్ నాయకుడు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *