మదనపల్లి సెప్టెంబర్ 24 : విద్యార్థి దశ నుంచే సామాజిక సేవ అలవర్చుకోవాలని బీటీ కళాశాల ప్రిన్సిపల్ గిరిబాబు పేర్కొన్నారు. గురువారం బీటీ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి కళాశాల అధ్యక్షులు డాక్టర్ గుత్తా గిరిబాబు అధ్యక్షుత వహించారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ లో చేరి, కార్యక్రమాలలో పాల్గొనడం అంటే మొత్తం జాతికి సేవ చేయడమేనని పేర్కొన్నారు. అందువల్ల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ లో చేరడానికి, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంపుల్లో దేశంలోని గ్రామాలను అధ్యయనం చేయడానికి, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, తద్వారా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయడానికి గొప్ప అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. రవీంద్రనాథ్ రెడ్డి సమన్వయం చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గన్నవరం శ్రీదేవి, ఐక్యూయేసీ కో-ఆర్డినేటర్ డాక్టర్ డేరంగుల శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ శైలజ సిఎస్, డాక్టర్ జి. చిన్నారెడ్డి, శటి. బాలాజీ, ఎల్.బి. ప్రదీప్, డాక్టర్ కృష్ణవేణి, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు సమాజ సేవ అలవర్చుకోవాలి
