మదనపల్లి నేలను తాకిన కృష్ణా జలాలు

మదనపల్లె, సెప్టెంబర్ 17:
మదనపల్లి సమీపంలోని చిప్పిలి వద్ద హంద్రీ–నీవా కాలువకు కృష్ణా జలాలు చేరుకున్న సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా జలహారతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలసీమకు కృష్ణా జలాలను తరలించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అపర భగీరథుడిగా అభివర్ణించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో కృష్ణా జలాలు మదనపల్లికి చేరడం సంతోషకరమన్నారు.

కృష్ణా జలాల రాకతో మదనపల్లి ప్రాంతంలో తాగునీటి, సాగునీటి సమస్యలకు ఉపశమనం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *