మదనపల్లె, సెప్టెంబర్ 17:
మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే దిశగా కృష్ణా జలాలను పట్టణానికి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


కోళ్లబైలు వద్ద హంద్రీ–నీవా సొరంగం నుంచి సుమారు 1,500 మీటర్ల పొడవున పైప్లైన్ ఏర్పాటు చేసి, నాలుగు మోటర్ల ద్వారా కృష్ణా జలాలను పంపింగ్ చేస్తున్నారు. రెండు పైపుల ద్వారా కృష్ణా జలాలు ప్రవహిస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పంపింగ్ చేసిన నీటిని అమ్మచెరువును నింపడంతో పాటు, పట్టణంలోని తాగునీటి బోర్లను రీచార్జ్ చేసేందుకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంతో పట్టణ తాగునీటి సమస్యకు కొంత ఉపశమనం లభిస్తుందని అధికారులు, నాయకులు పేర్కొన్నారు.
కృష్ణా జలాల తరలింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
