తంబళ్లపల్లె టిడిపి మాజీ ఇంచార్జ్ జయచంద్రారెడ్డి జైలుకు

మదనపల్లె, సెప్టెంబర్ 15:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితుడైన తంబళ్లపల్లె నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి, మరో నిందితుడైన ఆయన బామ్మర్ది మంత్రి గిరిధర్ రెడ్డి ఎట్టకేలకు మదనపల్లి కోర్టులో లొంగిపోయారు. గత ఏడాది అక్టోబర్లో మొలకలచెరువు సమీపంలోని ఓ షెడ్డులో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 23 మంది నిదృతులను గుర్తించగా అందులో.. తమ్మలపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి ఆయన బామ్మర్ది మంత్రి గిరిధర్ రెడ్డి పోలీసులు చెప్పకుండా పారిపోయారు.

ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది.

దీంతో నిందితులు జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి మంగళవారం మదనపల్లి కోర్టులో లొంగిపోయారు.

న్యాయస్థానం వీరిద్దరికీ 14 రోజులు పాటు రిమాండ్ విధించగా.. ఎక్సైజ్ పోలీసులు వీరిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహింప చేశారు. అనంతరం వీరిద్దరిని కడప సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *