వినాయక విగ్రహ మండపం నందు రక్తదాన శిబిరంమదనపల్లె, సెప్టెంబర్ 15: మదనపల్లి పట్టణంకమ్మగడ్డ వీధి ఎక్స్టెన్షన్ వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలు గా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ విఘ్నేశ్వరుడిని పూజిస్తున్నారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలని కూడా ఏర్పాటు చేస్తున్నారు. నేడు (15/09/2026) వినాయక విగ్రహం ముందు యశ్వంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో ఇరవై మంది యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో అతిథి గా పాల్గొన్న ఎస్.ఐ. రమాదేవి మాట్లాడుతూ దైవసేవలో సామాజిక సేవ అయిన రక్తదాన కార్యక్రమానికి చోటు కల్పించడం గొప్ప విషయం అని , కార్యనిర్వాహకులని , రక్తదాతలని అభినందించారు. ఈ కార్యక్రమం లో యశ్వంత్ , వినీత్ , ఫృద్వి , చలపతి , లోహిత్ , రాజేంద్ర ప్రసాద్ ,ప్రవీణ్ , హేమంత్ , రెడ్డి ప్రసాద్ , శంకర్ , ప్రణవ్ , కిరణ్ , బ్లడ్ బ్యాంకు సిబ్బంది , “వెల్ విషర్స్” గిరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *