వినాయక మండపాల్లో ఎమ్మెల్యే షాజహాన్ భాషా సుడిగాలి పర్యటన

పట్టణంలో 40కి పైగా మండపాల్లో ప్రత్యేక పూజలు.. ప్రజలతో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మదనపల్లి: వినాయక చవితి సందర్భంగా మదనపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా సుడిగాలి పర్యటనగా సందర్శించారు. స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి పలు మండపాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.

పట్టణంలోని జి.ఆర్.టి, బాంబూ బజార్, అమ్మినేని వీధి, గాంధీపురం, ప్రశాంత్ నగర్, శ్రీనివాస కళాశాల, రెడ్డీస్ కాలనీ, నీరుగట్టువారిపల్లి, గౌతమ్ స్కూల్, ఎన్టీఆర్ సర్కిల్, తిరుపతి రోడ్డు, బాలాజీ కాలనీ, దేవత నగర్ 5 క్రాస్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. నాయకులు, ప్రజల ఆహ్వానం మేరకు మదనపల్లి పట్టణంలోనే 40కి పైగా వినాయక మండపాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

మదనపల్లిలో ఏ పండుగ అయినా ప్రజలు ఐక్యంగా, వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు.

వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని మండపాల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఆయా మండపాల నిర్వాహకులు, స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *