20 ఏళ్ల డ్రైనేజీ సమస్యకు పరిష్కారం.. అభివృద్ధి పనులకు భూమిపూజ

మదనపల్లె,సెప్టెంబర్ 13:మదనపల్లి రూరల్ మండలం తట్టివారిపల్లి గ్రామంలోని ఎర్రగానిమిట్టలో గత 20 సంవత్సరాలుగా డ్రైనేజీ సౌకర్యం లేక స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించనుంది. ప్రజల కోరిక మేరకు నూతన డ్రైనేజీ అభివృద్ధి పనులకు మదనపల్లి ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా భూమిపూజ చేశారు.

స్థానికుల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించే దిశగా డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షంషీర్, శివ, లాల్ బాషా, షామీర్, లక్ష్మీపతి, గుర్రప్పతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *