భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పటం పూజ# పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు

మదనపల్లె, సెప్టెంబర్ 10:

మదనపల్లె మండలం రామాచార్లపల్లిలోని వీఆర్వో కత్తి నారాయణ నివాసంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పటం పూజ నిర్వహించారు. బుధవారం రాత్రి నిర్వహించిన అయ్యప్ప స్వామి పటం పూజ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యాలగిరి దొరస్వామి నాయుడు, వేంపల్లి గురుస్వామి సూరి,లోకేష్,రఘు, గిరిధర్, శ్రీనివాసులు,మరియు అయ్యప్ప స్వామి భక్తులు, నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *