మదనపల్లె, సెప్టెంబర్ 9:
నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తూ,ప్రజలకు నిత్యం వంటగదిలో వాడే ఉప్పు,పప్పు,నూనె,ఎర్రగడ్డ,తెల్లగడ్డ,చక్కె వంటి వంటకు ఉపయోగించే నిత్యవసర సరుకులు పైన అధికంగా రేట్లు పెంచడం దుర్మార్గం అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల కాలంలో నిత్యవసర సరుకులు,పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని,పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తుమలప్ప, ముని రెడ్డి,చలపతి,శ్రీనివాసులు, తరుణ్ నవ్య తదితరులు పాల్గొన్నారు.
నిత్యవసర సరుకులు ధరలనుతగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలోనిరసన
