టెన్నిస్‌లో రన్నరప్‌గా నిలిచి స్ఫూర్తినిచ్చిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె, సెప్టెంబర్ 8: రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 4 తేదీ వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026′ పోటీల్లో అన్నమయ్య జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారు. కర్నూలు రేంజ్ తరపున ప్రాతినిధ్యం వహించిన అన్నమయ్య జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ సత్తా చాటి మొత్తం 21 పతకాలను కొల్లగొట్టారు.
ఈ విజయం సాధించిన క్రీడాకారుల బృందం మంగళవారం మదనపల్లెలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు.
అన్నమయ్య జిల్లా సాధించిన పతకాల వివరాలు:
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్వయంగా టెన్నిస్ డబుల్స్ విభాగంలో అద్భుత ఆటతీరును ప్రదర్శించి రన్నరప్‌గా నిలిచి సిల్వర్ మెడల్ (రజతం) సాధించారు.
మొత్తం పతకాలు 21 సాధించగా అందులో
స్వర్ణ పతకాలు (Gold): 7
రజత పతకాలు (Silver): 8
కాంస్య పతకాలు (Bronze): 6
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. “పోలీస్ వృత్తి నిరంతర ఒత్తిడితో కూడుకున్నది. క్రీడల ద్వారా ఆ ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించవచ్చు. సిబ్బంది విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనాలి. క్రీడలు మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని అందిస్తాయి. రాష్ట్ర స్థాయి పోటీల్లో 21 పతకాలు సాధించడం అన్నమయ్య జిల్లాకు గర్వకారణం అన్నారు.
