సమాజాన్ని మార్చేదే మీడియా

మంత్రి : మండిపల్లె

మదనపల్లె, సెప్టెంబర్ 6: సమాజాన్ని నడవడికతో మార్చేది మీడియా అని మంత్రి మండిపల్లె రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం స్థానిక శ్రీ కృష్ణ కల్యాణ మండపంలో APUWJ ఆధ్వర్యంలో “” సమాజంపై సోషల్ మీడియా ప్రభావం “” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్రభావం సమాజంలో ఎక్కువగా ఉందని… దీన్ని మంచి కోసమే ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి విద్యార్థి విద్యార్థులు, మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు విలేకరులే అని పేర్కొన్నారు. సోషల్ మీడియాతో చెడు ప్రభావానికి లోను కాకుండా, మంచి నడవడికతో ఉపయోగిస్తే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *