ఈనెలాఖరులోపు త్రైమాసిక పన్ను చెల్లించండి.. లేకపోతే 100%–200% జరిమానా: ఆర్టీవో హెచ్చరిక

మదనపల్లె, జూలై 27: (gtvmedia)రవాణా వాహనాల యజమానులు సెప్టెంబర్ 30 వరకు వర్తించే త్రైమాసిక పన్నును ఈ నెలాఖరులోపు తప్పనిసరిగా చెల్లించాలని అన్నమయ్య జిల్లా రవాణా శాఖ అధికారి (RTO) అశోక ప్రతాపరావు సూచించారు.

వాహనదారులు పరివాహన్ సేవా (Parivahan Sewa) పోర్టల్ ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించవచ్చని తెలిపారు. పన్ను చెల్లించిన తర్వాత వచ్చిన ఆన్‌లైన్ రశీదును భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం, జూలై 31లోపు పన్ను చెల్లించని రవాణా వాహనాలు ఆగస్టు 1 నుంచి రోడ్లపై తనిఖీల్లో పట్టుబడితే 100 శాతం జరిమానా విధిస్తారు. సెప్టెంబర్ నెలలో పట్టుబడితే 200 శాతం జరిమానా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అందువల్ల, జరిమానాలు తప్పించుకోవాలంటే వాహన యజమానులు గడువు ముగియకముందే త్రైమాసిక పన్ను చెల్లించాలని ఆర్టీవో విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు లేదా సహాయం కోసం సంబంధిత స్థానిక ఆర్టీవో కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *