అనకాపల్లిలో భారీగా గంజాయి స్వాధీనం.. ముగ్గురు నిందితులు అరెస్ట్

అనకాపల్లి జిల్లా: సెప్టెంబర్ 4:జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి తుని వైపు అక్రమంగా తరలిస్తున్న రూ.3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయిని అనకాపల్లి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గంజాయిని తరలిస్తున్న వాహనాలను పోలీసులు గుర్తించి తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక వ్యాన్‌తో పాటు, ముందుగా మార్గాన్ని పరిశీలిస్తూ పైలట్‌గా వ్యవహరించిన హోండా సివిక్ కారును కూడా పోలీసులు సీజ్ చేశారు.

జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *