మాలేనత్తంలో నూతన తాగునీటి బోరు ను ప్రారంభించిన MLA షాజహాన్ భాషా

మదనపల్లి, సెప్టెంబర్ 2: మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామంలో నూతన తాగునీటి బోరును ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ప్రారంభించారు.

స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే బోరును ప్రారంభించి గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి నూతన బోరు ఉపయోగపడుతుందని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *