అన్నమయ్య జిల్లా మదనపల్లె: (gtvmedia)సిటిఎం రోడ్డులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తట్టివారిపల్లి ఫ్లైఓవర్ సమీపంలో దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కర్ణాటకకు చెందిన కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న భర్త అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు.
108 సిబ్బంది గాయపడిన మహిళను మనోహర్ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
