న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులకు ఇండియన్ రైల్వే శుభవార్త అందించింది. వెస్ట్రన్ రైల్వేలో 2026–27 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా కింద 64 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత, ఆసక్తి ఉన్న క్రీడాకారులు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతగా టెన్త్, ఇంటర్ లేదా డిగ్రీతో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న క్రీడా అర్హతలు కలిగి ఉండాలి.
సంబంధిత క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు, 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తుకు అర్హులుగా పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో క్రీడా ట్రయల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదని సమాచారం.
క్రీడా ప్రతిభతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న యువతకు ఈ నియామకాలు మంచి అవకాశంగా మారనున్నాయి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న క్రీడా అర్హతలు, విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించుకోవాలి.
