నాదెండ్ల అరుణ్ చింటూ, ప్రణయ్ రాయల్‌కు ఘనంగా జన్మదిన వేడుకలు

ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి: శ్రీరామ్ చినబాబు

మదనపల్లె: మదనపల్లె టీడీపీ టౌన్ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్‌ (చింటూ), టౌన్‌ యూత్‌ అధ్యక్షుడు ప్రణయ్‌ రాయల్‌ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు, యువత, అభిమానులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు నాదెండ్ల అరుణ్‌ చింటూకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చింటూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరింతగా రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. టీడీపీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి చింటూ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

అలాగే టౌన్‌ యూత్‌ అధ్యక్షుడు ప్రణయ్‌ రాయల్‌కు నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువతను సమన్వయం చేస్తూ పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీడ్స్‌ మల్లికార్జున, రామకృష్ణ, ‌, ఆర్‌జే వెంకటేష్‌, రాటకొండ మధుబాబు, వట్టికొండ వెంకటేష్‌, , రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు, రామాంజి, చీకులబైలు ప్రభాకర్‌, మహబూబ్‌ ఖాన్‌, ఉమేష్‌, సాయి, ఏశ్వంత్‌ చౌదరి, లలిత్‌, ‌, వరప్రసాద్‌, చందు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *