మదనపల్లె, ఆగస్టు 28: (gtvmedia)మదనపల్లె పట్టణంలో కొలువైన పురాతన ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో శుక్రవారం స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అలివేలుమంగా సమేత వెంకటరమణ స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడింది.
కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.
