శ్రీ మహాగణపతి ఆలయంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు.. తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తజనం


మదనపల్లె,july28 (Gtvmedia): మదనపల్లె పట్టణంలోని తాళ్ళ సుబ్బన్న కాలనీలో ఉన్న శ్రీ మహాగణపతి దేవాలయంలో నేడు శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సత్యనారాయణ స్వామివారి వ్రతంలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి కృప, ఆశీస్సులు తమ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఈ వ్రత కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *