మదనపల్లె, ఆగస్టు 26: అన్నమయ్య జిల్లా తరఫున రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన జిల్లా జట్టు క్రీడాకారులకు జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్, జునైద్ అక్బరి శుభాకాంక్షలు తెలిపారు.
మదనపల్లె ఆరోగ్యవరం ప్రాంతంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను జునైద్ అక్బరి అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అన్నమయ్య జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
క్రీడాకారులకు అవసరమైన సూచనలు, సలహాలు అందజేసి క్రమశిక్షణతో సాధన చేస్తూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు, వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు క్రీడా సంఘం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు కోచ్లు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.
