మదనపల్లె, ఆగస్టు 26:( gtvmedia)మదనపల్లి పట్టణంలోని జహ చేనేత నగర్లో టీడీపీ నాయకులు రఘుపతి నాయుడు సహకారంతో, స్వాస్థ్య హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో ఓపీ ఉచితంగా నిర్వహించడంతో పాటు ప్రొసీజర్ చార్జీలు కూడా లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్న స్వాస్థ్య హాస్పిటల్స్ యాజమాన్యానికి, సహకరించిన టీడీపీ నాయకులు రఘుపతి నాయుడుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
