కొత్తఇంద్లు గ్రామపంచాయతీలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు
మదనపల్లె రురల్ Gtv ప్రతినిధి: వర్షాలు లేక పంటలు, తాగునీటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో మదనపల్లె పరిధిలోని కొత్తఇంద్లు గ్రామపంచాయతీ ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామంలో సుభిక్షం నెలకొనాలని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించి, త్వరగా వర్షాలు కురవాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పంటలకు నీటి కొరత ఏర్పడుతోందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో త్వరలోనే వర్షాలు కురిసి గ్రామంలో పచ్చదనం, సుభిక్షం నెలకొనాలని కోరుకున్నారు.
ఈ పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వర్షాలు కురవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు
