టెక్నాలజీ సభా ఎక్సలెన్స్ అవార్డ్స్–2026 అందుకున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె, ఆగస్టు 25: (gtvmedia)అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి రూపొందించిన వినూత్న కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (CMS) ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
జైపూర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో **‘టెక్నాలజీ సభా ఎక్సలెన్స్ అవార్డ్స్–2026’**ను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అందుకున్నారు.
కోర్టు కేసులు, నిందితుల వివరాలు, కేసుల ప్రస్తుత స్థితి, కేసుల పర్యవేక్షణతో పాటు కోర్టు సమన్లు, వారెంట్ల ప్రక్రియను డిజిటలైజ్ చేసి సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు CMS వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ ద్వారా కేసుల విచారణ ప్రక్రియ మరింత వేగవంతం కావడంతో పాటు న్యాయస్థానాల్లో కేసుల పురోగతిని సమర్థవంతంగా పర్యవేక్షించే అవకాశం ఏర్పడుతుంది.
కేసుల దర్యాప్తు, కోర్టు ప్రక్రియల పర్యవేక్షణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేలా CMSను రూపొందించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి జాతీయ స్థాయిలో అవార్డు దక్కడం పట్ల అన్నమయ్య జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు అభినందనలు తెలిపారు.
జిల్లా పోలీసు వ్యవస్థలో సాంకేతికతను వినియోగిస్తూ వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సాధించిన ఈ గుర్తింపు అన్నమయ్య జిల్లాకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.
