మదనపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

మదనపల్లి, ఆగస్టు 24: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. రెండు బృందాలుగా అధికారులు కార్యాలయంలోని వివిధ విభాగాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

తనిఖీల సందర్భంగా రూ.30 వేలకు పైగా నగదు గుర్తించినట్లు సమాచారం. అయితే ఆ నగదు ఎవరికి సంబంధించినది, ఏ కారణంతో కార్యాలయంలో ఉందనే విషయాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

సాయంత్రం వరకు ఏసీబీ తనిఖీలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అధికారులు తనిఖీలు పూర్తి చేసి బయటకు వచ్చిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *