అంగళ్లు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

కురబలకోట, ఆగస్టు 23:( gtvmedia)అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని మల్లయ్యకొండ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.

మృతుడిని కురబలకోట మండలం కన్నెమడుగుకు చెందిన **రెడ్డిశేఖర్ (27)**గా గుర్తించారు. ఆయన తంబళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనతో కన్నెమడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *