మదనపల్లె, ఆగస్టు 23: )gtvmedia)మదనపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాలు బైగారి భారతి నాయుడు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ విమర్శలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా నాయకత్వంలో పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.
నిసార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ మహిళా విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు బైగారి భారతి నాయుడు తెలిపారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆమె అన్నారు.
