బాలేపల్లి భారతంలో పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా

నిమ్మనపల్లి, ఆగస్టు 22:( gtvmedia)మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలం బాలేపల్లిలో నిర్వహించిన ప్రసిద్ధ భారతం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా పాల్గొన్నారు. స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. బాలేపల్లిలో నిర్వహించే భారతం ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన భక్తులందరూ ప్రజల సుఖసంతోషాలు, పాడిపంటల అభివృద్ధి కోసం ప్రార్థించాలని కోరారు.

ముఖ్యంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకునేలా స్వామివారిని ప్రార్థించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రజలకు మంచి జరగాలని, రైతాంగం అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#Madanapalli #ShajahanBasha #Nimmanapalle #Balepalli #Bharatham

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *